
సివిల్స్ లక్ష్యంగా ముందుకు..
గ్రూప్ –2లో డీటీగా ఎంపికై న
గజ్వేల్ యువకుడు
గజ్వేల్‌రూరల్: సివిల్స్ కోచింగ్ తీసుకుంటూనే ఓ యువకుడు ఇటీవల విడుదలైన గ్రూప్– 2లో డీటీగా ఎంపికయ్యాడు. గజ్వేల్ పట్టణంలోని అయ్యప్పనగర్ కాలనీకి చెందిన తాటి మురళి–భాగ్యలక్ష్మి దంపతుల చిన్న కొడుకు సాయికుమార్ బీటెక్(మెకానికల్)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేశాడు. అనంతరం 2018 నుంచి సివిల్స్ లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ పొందుతున్నాడు. ఇటీవల వెలువడిన గ్రూప్ –2లో 14వ ర్యాంకుతో 418 మార్కులను సాధించి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ సివిల్స్‌కు ఎంపికవడమే తన లక్ష్యమని తెలిపాడు. కాగా అతడిని కాలనీవాసులు అభినందించారు.
ఏఎస్‌ఓగా ఎంపికై న సాయిప్రియ
కొండపాక(గజ్వేల్): చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఓ పేదింటి విద్యార్థిని. ఇటీవల వెల్లడించిన గ్రూప్ –2 ఫలితాల్లో మినుకూరి సాయిప్రియ 826వ ర్యాంకు సాధించి జీఏడీలో ఏఎస్‌ఓగా ఉద్యోగ అర్హతను సాధించింది. మండలంలోని మర్పడ్గ గ్రామానికి చెందిన ఆమె ఇంటర్, బీటెక్, పీజీ విద్య నభ్యసించి గ్రూప్‌లో ఉద్యోగం పొందాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఈ క్రమంలోనే గ్రూప్ –2, గ్రూప్ –3, గ్రూప్ –4 పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన గ్రూప్ –2 ఫలితాల్లో ఏఎస్‌ఓగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. తల్లి స్వరూప అంగన్‌వాడీ టీచరుగా పని చేస్తుండగా, తండ్రి కిష్టయ్య ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు.
రైతు బిడ్డకు ఘన సన్మానం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు బిడ్డ నరిగే స్వామి ఇటీవల గ్రూప్ –1లో రాష్ట్ర స్థాయిలో 95వ ర్యాంకు సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. కాగా ఉద్యోగం సాధించిన తరువాత సోమవారం గ్రామానికి రావడంతో అతడికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. యూత్ సభ్యులతో పాటు గ్రామస్తులు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వామిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

సివిల్స్ లక్ష్యంగా ముందుకు..

సివిల్స్ లక్ష్యంగా ముందుకు..