
సింగూరుకు భారీ వరద
11 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
సింగూరు డ్యామ్ నీటి పరవళ్లు
పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇప్పటికే 10 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్న అధికారులు సోమవారం మరో గేట్‌ను ఎత్తి దిగువకు నీటిని వదిలారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీ వరదలు రావడంతో 11 గేట్లను రెండు మీటర్ల మేర ఎత్తి దిగువకు లక్షా 6,797 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టులో 18 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా నీటిని వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి దిగువకు ఇన్‌ఫ్లో ఎక్కువ కావడంతో మంజీరా నది పరివాహకంలోని పంటలు మునిగి పోయాయి.