
వయసు రెండేళ్లు.. రికార్డులు ఆరు
సంగారెడ్డి జోన్: అతి చిన్న వయసులో జాతీయ, అంతర్జాతీయ రికార్డులు సాధించాడు ఆ బుడతడు. పటాన్‌చెరులో నివాసం ఉంటున్న అపురూప–సత్యనారాయణరెడ్డిల రెండు సంవత్సరాల కుమారుడు రుద్రాన్స్‌రెడ్డి చిన్న వయసులో ఎక్కువ దూరం నడిచి రికార్డులు సొంతం చేసుకున్నాడు. రుద్రాన్స్ 47 నిమిషాల్లో 3.23 కిలోమీటర్ల దూరం, గంట వ్యవధిలో 4.29 కిలోమీటర్లు ఏకకాలంలో నడిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండు సొంతం చేసుకున్నాడు. గంట వ్యవధిలో 4.29 కిలోమీటర్ల దూరాన్ని ఏకకాలంలో నడిచినందుకుగాను ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గ్రాండ్ మాస్టర్ టైటిల్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కలామ్స్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కించుకున్నాడు. తాత నరేందర్‌రెడ్డి ప్రోత్సహంతోనే రికార్డులు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తన కార్యాలయంలో చిన్నారిని అభినందించి, సన్మానించారు. రుద్రాన్స్‌ని మంచి క్రీడాకారుడిగా తయారు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
చిన్నారిని అభినందించిన కలెక్టరు