
మల్బరీ సాగుతో అధిక లాభాలు
● సెరి కల్చర్ ఏడీఏ ఇంద్రసేనారెడ్డి
బెజ్జంకి(సిద్దిపేట): మల్బరీ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని సెరి కల్చర్ ఏడీఏ ఇంద్రసేనారెడ్డి సూచించారు. మండలంలోని గాగిళ్లాపూర్‌లో మల్బరీ సాగుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ప్రో త్సాహకంగా మల్బరీకి సంబంధించిన యూ నిట్ నిర్మాణంతోపాటు మొక్కలు, డ్రిప్, స్ప్రింక్లర్ తదితరాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతినెలా ఆదాయం వస్తుందన్నారు. సమావేశంలో ఎస్‌ఓ శర్మ, గ్రామ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, మాజీ సర్పంచ్‌లు పులి శ్రీనివాస్, మాచం శ్రీనివాస్, రైతులు అన్నాడి శ్రీధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, బాలయ్య, రమణారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రుద్రారంలో లుక్ ఆఫ్
తెలంగాణ భామ సందడి
మిరుదొడ్డి(దుబ్బాక): మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణ అందాల పోటీల్లో కీర్తి కిరీటాన్ని కైవసం చేసుకున్న అందాల భామ తుమ్మల ఆర్తీ అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని తన స్వగ్రామమైన రుద్రారంలో బుధవారం సందడి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో అమీర్ పేట స్కైల్ ప్రొడక్షన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచారు. ఆర్తీకి క్లౌడ్ మీడియా చైర్మన్ రామకృష్ణ, హైకోర్టు అధికారి వేణుగోపాల్, రిజిస్ట్రేషన్ డీఐజీ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా విజేత కిరీటంతోపాటు చెక్కును అందించారు. స్వగ్రామానికి వచ్చిన ఆమెను గ్రామస్తులు ఘనంగా స్వాగతించి సన్మానించారు. గ్రామానికి చెందిన తుమ్మల యాదగిరి, మాదమ్మ దంపతుల కూతురు ఆర్తీ మహారాష్ట్రలోని నాగపూర్‌లో బీఈ ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పట్టా పొందారు. ఎస్టీ జాబితాలోకి
నక్కల కులస్తులు
● ఫలించిన 8 ఏళ్ల పోరాటం
తొగుట(దుబ్బాక):తొగుట మండలం ముత్యంపేటకు చెందిన నక్కల (పిట్టల) కులస్తుల 8 ఏళ్ల సుధీర్ఘ పోరాటం ఫలించింది. ప్రభుత్వం నక్కల కులస్తులను గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చింది. ఇక నుంచి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందనున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం తహసీల్దార్ గ్రామాన్ని సందర్శించి పూర్వ పరాలను విచారించారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్ తన కార్యాలయంలో వారికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దీంతో గ్రామంలోని సుమారు 80 కుటుంబాలకు అన్ని రకాల ప్రభుత్వ సౌకర్యాలు పొందుతారు. వారి న్యా య పోరాటానికి సామాజిక సమరసత వేదిక అండగా నిలిచింది. ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తంచేశారు.

మల్బరీ సాగుతో అధిక లాభాలు