
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
● మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి ● ముగిసిన రాష్ట్ర స్థాయి జూనియర్‌సాఫ్ట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ● నిజామాబాద్ జట్టుకు బంగారు,మెదక్ జట్టుకు రజత పతకం
తూప్రాన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో గురుకుల పాఠశాల ఆవరణలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణేశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు. అనంతరం సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నారాయణగుప్త మాట్లాడుతూ. ఫైనల్‌లో పోటీల్లో మెదక్ జిల్లా–నిజామాబాద్ జిల్లా జట్లు హోరాహోరీగా పోటీ పడగా నిజామాబాద్ జట్టు 6–1 తేడాతో విజయం సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకుందన్నారు. మెదక్ జిల్లా జట్టు రజత పతకం, హనుమకొండ జట్టు కాంస్య పతకాలను కై వసం చేసుకున్నాయని తెలిపారు. అనంతరం సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు మాట్లాడుతూ.. చండీఘర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలుర జట్టు రాణించి బంగారు పతకం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేత జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభిషేక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, కోశాధికారి రేణుక, జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అజయ్ కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్యాం సుందర్ శర్మ, కోశాధికారి గోవర్ధన్ గౌడ్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్, మంచిర్యాల కార్యదర్శి కిరణ్, మాజీ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మామిండ్ల కృష్ణ, వివిధ జిల్లాల జట్ల కోచ్‌లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.