సెట్విన్‌ కార్పొరేషన్‌చైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

సెట్విన్‌ కార్పొరేషన్‌చైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి

Jul 9 2024 6:38 AM | Updated on Jul 9 2024 6:38 AM

సెట్వ

సెట్విన్‌ కార్పొరేషన్‌చైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి

జహీరాబాద్‌: మాజీ ఎంపీపీ ఎన్‌.గిరిధర్‌రెడ్డికి సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి దక్కింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 24 మందికి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులను ప్రకటించారు. అందులో గిరిధర్‌రెడ్డికి చోటు దక్కింది. సొసైటీ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌ ట్విన్‌ సిటీస్‌(సెట్విన్‌) చైర్మన్‌గా నియమించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిన సమయంలో జహీరాబాద్‌ నియోజకవర్గంలో గిరిధర్‌రెడ్డి పార్టీని బతికించి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చారు. తర్వాత మండలంలోని చిరాగ్‌పల్లికి చెందిన ఆయన స్వగ్రామంలో ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం జహీరాబాద్‌ ఎంపీపీ అధ్యక్షుడిగా గెలువడంతో పాటు జహీరాబాద్‌, కోహీర్‌, ఝరాసంగం జెడ్పీటీసీ స్థానాలను, మొగుడంపల్లి, కోహీర్‌, ఝరాసంగం ఎంపీపీ స్థానాలు కాంగ్రెస్‌కు దక్కాయి. మాజీ మంత్రి గీతారెడ్డి వయసు పైబడిన కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండడంతో జహీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ బాధ్యతలను గిరిధర్‌రెడ్డి మోసి పార్టీని నిలబెట్టారు. దీంతో ఆయన పార్టీకి అందించిన సేవలను గుర్తించి ఈ మేరకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని అధిష్టానవర్గం కేటాయించింది.

ఆ పాఠశాలలపైచర్యలు తీసుకోవాలి

నారాయణఖేడ్‌: నిబంధనలు పాటించని, అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిలభారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య ఉమ్మడి మెదక్‌ జిల్లా కార్యదర్శి తెంకటి కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం నారాయణఖేడ్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించకపోగా అనుమతులు లేని పాఠశాలలు అనేకం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భవనాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, దీంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. పాఠశాలలకు సమీపాల్లో వాటి యజమానులే షట్టర్లు అద్దెకు తీసుకుని పాఠ్య, నోట్‌బుక్స్‌, ఏకరూప దుస్తులు, విద్యాసామగ్రి విక్రయాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. కొన్ని పాఠశాలలు అనుమతులు లేకుండానే హాస్టళ్లను నడుపుతున్నాయన్నారు. అలాంటి పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ డివిజన్‌ నాయకులు రమేష్‌, ప్రవీణ్‌, జాన్‌ పాల్గొన్నారు.

రాయికోడ్‌ ప్రిన్సిపాల్‌నుసస్పెండ్‌ చేయాలి

జహీరాబాద్‌ టౌన్‌: రాయికోడ్‌ గురుకులంలో చోటు చేసుకున్న సంఘటనపై విచారణ జరిపించి ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజేష్‌ డిమాండ్‌ చేశారు. జహీరాబాద్‌ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకుల భవనంపై నుంచి దూకి గాయలైన విద్యార్థి మల్లేశ్వరీ వైద్య ఖర్చులు యాజమాన్యం భరించాలని కోరారు. విద్యార్థి వైద్యం పట్ల నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు హరీశ్‌, అతీక్‌, పృథ్వీరాజ్‌, మహేష్‌ ఉన్నారు.

వైష్టవికి గోల్డ్‌మెడల్‌

సదాశివపేట (సంగారెడ్డి): సదాశివపేటకు చెందిన నాగారం వైష్ణవి ఎంటెక్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించింది. 2022–23 విద్యాసంవత్సంలో హైదరాబాద్‌లోని సీవీఆర్‌ కళాశాలలో ఎంటెక్‌ విద్యనభ్యసించింది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమెను.. ఆదివారం కళాశాల వైన్స్‌ చాన్సలర్‌ అధ్యాపక బృందం సత్కరించి గోల్డ్‌మెడల్‌ అందజేసింది. వైష్ణవి భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, పట్టా అందుకోవడం తమ కళాశాలకు గర్వకారణమని సీవీఆర్‌ కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. కాగా తమ కూతురు గోల్డ్‌మెడల సాధించడం పట్ల వైష్ణవి తల్లిదండ్రులు నర్సింలు, మాధవి తెగసంబరపడి పోతున్నారు. రాజు, వైష్ణవి, జగదీశ్వర్‌, సువర్ణ, హేమంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

సెట్విన్‌ కార్పొరేషన్‌చైర్మన్‌గా  గిరిధర్‌రెడ్డి
1
1/1

సెట్విన్‌ కార్పొరేషన్‌చైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement