అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య? | - | Sakshi
Sakshi News home page

అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య?

Oct 13 2026 11:43 AM | Updated on Oct 13 2026 11:43 AM

రైలు పట్టాలపై మృతదేహం లభ్యం

షాద్‌నగర్‌: అనా రోగ్య సమస్యల నేపథ్యంలో ఓ వ్యక్తి రైలు పట్టాల మృతి చెంది కనిపించాడు. ఈ సంఘటన నందిగామ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలం నిర్దవెళ్లి గ్రామానికి చెందిన కమ్మరి పాండయ్య (59) 25 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నందిగామకు వచ్చి వడ్రంగి పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవించేవాడు. ఆయన భార్య రెండేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్న పాండయ్య కొంత కాలంగా తీవ్రమైన కాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. అనారోగ్య సమస్యలతో రోజువారీ పనులు చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రైలు పట్టాలపై అతని మృతదేహం లభ్యమైంది. ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు.

కుటుంబ కలహాలతో యువకుడి అదృశ్యం

యాచారం: కుటుంబ కలహాలతో మనుస్తాపానికి గురైన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మీర్‌ఖాన్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివీ.. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన వరికుప్పల నర్సింహ (30) మద్యానికి బానిసయ్యాడు. తరచూ ఇంట్లో గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి నుంచి బైక్‌ తీసుకుని వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా జాడలేదు. ఈ క్రమంలో నర్సింహ భార్య విజయ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలిక అదృశ్యం

శంకర్‌పల్లి: తల్లిదండ్రులతో పాటే రాత్రి ఇంట్లో నిద్రించిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) పదో తరగతి ఫెయిలై ఇంటి వద్దే ఉంటోంది. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి నిద్రించింది. అర్థరాత్రి లేచి చూస్తే కూతురు కనిపించలేదు. ఇంట్లో, చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రుధ్వీర్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement