వైరా: ఖమ్మం జిల్లా వైరాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 12వ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా (లెగ్ వాలీవాల్) చాంపియన్ షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. స్థానిక న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో నిర్వహించిన పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి పురుషులు, మహిళల జట్లు హాజరయ్యాయి. పురుషుల విభాగంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా జట్లు, మహిళల విభాగంలో రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. విజేతలకు ఎస్‌ఐ పుష్పాల రామారావు, న్యూలిటిల్ ఫ్లవర్ పాఠశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేశ్వరరావు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాపా మురళీకృష్ణ, రాష్ట్ర, జిల్లా ఉపాధ్యక్షులు జగన్నాథస్వా మి, ఆర్.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


