● ఆహార పదార్థాలపై బొద్దింకలు
● వినియోగదారుల ఆందోళన
మొయినాబాద్: పైన పటారం.. లోన లొటారం అన్నట్లు ఉంది సూపర్ మార్కెట్ల వ్యవహారం. మొయినాబాద్‌లోని ఓ సూపర్ మార్కెట్‌లో పాడైన పండ్లు విక్రయిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. సోమవారం మొయినాబాద్‌కు చెందిన ఓ వినియోగదారుడు స్థానిక సూపర్ మార్కెట్‌లో కట్ చేసిన ఫ్రూట్స్ కొనుగోలు చేశాడు. బొప్పాయి, జామ పండ్ల ముక్కలు బూజుపట్టి పాడైపోయాయి. వాటిని అలాగే ప్యాక్ చేసి విక్రయిస్తున్నారని.. సిబ్బందిని అడిగితే సరైన సమాధానం చెప్పడంలేదని వాపోయాడు. ఫ్రిజ్ లోపల, బయట ఉన్న ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరగుతున్నాయని.. సూపర్ మార్కెట్‌లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆరోపించారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


