శంకర్‌పల్లి: పట్టణ చౌరస్తాలో రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డీసీపీ శివం ఉపాధ్యాయ అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ యోగేశ్‌తో కలిసి గురువారం శంకర్‌పల్లి చౌరస్తాలో జంక్షన్ అభివృద్ది, ట్రాఫిక్ పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకు అనుగుణంగా ట్రాఫిక్ మెరుగుపరచాలన్నారు. రోడ్డుపై అనుమతి లేకుండా వెలసిన షెడ్లు, దుకాణాలను వెంటనే తొలగించి మరో చోటికి తరలించాలన్నారు. ట్రాఫిక్‌ని దృష్టిలో ఉంచుకొని త్వరలో సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని, అందుకు మున్సిపల్ శాఖ సహకరించాలని కోరారు. అనంతరం మోకిల, ప్రొద్దటూరు గేటు వద్ద వాహనాల వేగాన్ని నిలుపుదల చేసేందుకు నియంత్రికలను ఏర్పాటు చేయించారు. కార్యక్రమంలో చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
తుర్కయంజాల్: ఆదిభట్ల సర్కిల్ పరిధి తుర్కయంజాల్ డివిజన్ పరిధిలోని ప్రముఖ్ టౌన్‌షిప్‌లో 3.14 ఎకరాల భూమిలో గురువారం హైడ్రా అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. టౌన్‌షిప్‌లో అన్యాక్రాంతం అవుతున్న 3.14 ఎకరాల భూమిని కాపాడాలని టౌన్‌షిప్ సంక్షేమ సంఘం సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా సీఐ సైదులు పార్కు స్థలాన్ని పరిశీలించడంతో పాటు సర్వే నిర్వహించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చే శారు. పార్కు స్థలాన్ని కాపాడినందుకు టౌన్‌షిప్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.


