అవసరమైతేనే పురుగు మందు వాడాలి | - | Sakshi
Sakshi News home page

అవసరమైతేనే పురుగు మందు వాడాలి

Oct 9 2026 6:48 AM | Updated on Oct 9 2026 6:48 AM

షాబాద్‌: కంది పంటకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పురుగు మందు పిచికారీ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత పేర్కొన్నారు. మండల పరిధిలోని నరెడ్లగూడ, అంతారం గ్రామాల్లో రైతులు సాగు చేసిన కంది పంటను గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. బోపాల్‌ పప్పుధాన్యాల అభివృద్ధి డైరెక్టరేట్‌కు చెందిన జాయింట్‌ డైరెక్టర్‌ డా. ఏకే శివహరే, రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్‌ కార్యాలయం జేడీఏ బాలు నాయక్‌, టెక్నికల్‌ ఏడీఏ పద్మజ తదితరులతో కలిసి పంట సాగును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే పురుగు మందులను వినియోగించాలని రైతులకు సూచించారు. జేడీఏ బాలునాయక్‌ మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతుల్లో పంట సాగుతో కంది దిగుబడిని పెంచడం, అవసరమైన నష్టాలను తగ్గించడం, వ్యవసాయ ఇన్‌పుట్‌లను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి దండెం విజయచంద్ర, సర్పంచులు వీరమ్మ, పద్మమ్మ, డైరెక్టర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు శివ తేజ, మౌనిక, బాబ్యనాయక్‌, రాజేశ్వరి, శైలజ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యవసాయాధికారి సుజాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement