సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా నియమితులైన డాక్టర్ కె.కళ్యాణ్ చక్రవర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన జిల్లా క్షయ నివారణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన డాక్టర్ స్వర్ణకుమారి ఇటీవలే ఏసీబీ కేసులో అరైస్టె జైలుకు వెళ్లడం, ఆమె స్థానంలో తాత్కాలిక డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి బాధ్యతలు అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించగా, జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ పాపారావు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ షఫీ, ప్రోగ్రాం అధికారి అక్రమ్, డాక్టర్ రాకేష్ ఆయన్ను శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.


