ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌కు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌కు రిమాండ్‌

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌కు రిమాండ్‌

ధారూరు: మండలంలోని అనంతగిరి చివరిగుట్ట కేరెళ్లి గ్రామ సమీపంలో శనివారం బస్సు బోల్తా పడిన ఘటనలో సోమవారం డ్రైవర్‌ను రిమాండ్‌కు తరలించామని సీఐ రాఘరామ్‌ తెలిపారు. మెదక్‌ జిల్లా రేగోడ్‌ మండలం, సంగమేశ్‌తండాకు చెందిన ప్రైవేటు బస్సు డ్రైవర్‌ పాళ్త్యా వాసుదేవ్‌ అలియాస్‌ వాసు (30) బస్సుకు ప్రమాదం జరిగిన సమయంలో పారిపోగా, గాలించి పట్టుకుని, న్యాయస్థానంలో హాజరు పర్చామన్నారు. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కల్గించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement