అవినీతి జబ్బు! | - | Sakshi
Sakshi News home page

అవినీతి జబ్బు!

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 అవినీతి జబ్బు! ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్‌కు ఇష్టారీతిన అనుమతులు

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
వైద్య ఆరోగ్యశాఖకు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా వైద్య ఆరోగ్యశాఖను అవినీతి జబ్బు పట్టిపీడిస్తోంది. ఆస్పత్రుల తనిఖీలు, కొత్త ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌, నర్సింగ్‌ కాలేజీలు, ఫిజియో థెరపీ కేంద్రాలకు అనుమతుల జారీ, గడువు ముగిసిన ఆస్పత్రులకు లైసెన్సుల రెన్యూవల్‌, కొత్తగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకాల పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని వైద్యులు రోగులను పట్టి పీల్చుకుతింటుంటే.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సొంత ఉద్యోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు.

రూ.రెండు లక్షలు డిమాండ్‌ చేసి..

ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఫిజియోథరెపీ యాజమాన్యం సీజ్‌ చేసిన తమ సెంటర్‌ను తిరిగి తెరిపించడం సహా ఎలాంటి లైసెన్స్‌ లేకుండా నడుపుకునేందుకు అనుమతి పొందడం కోసం వైద్య ఆరోగ్యశాఖను ఆశ్రయించారు. ఇందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రూ.2 లక్షలు డిమాండ్‌ చేయగా, రూ.లక్ష ఇచ్చేందుకు అంగీకరించి, ఆ మేరకు బాధితులు సోమవారం ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వర్ణకుమారి సహా హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌, ఆయన ప్రైవేటు డ్రైవర్‌ మద్దూరు కృష్ణయ్యను వలపన్ని పట్టుకున్నారు. డ్రైవర్‌ నుంచి రూ.లక్ష స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఇళ్లు సహా శివరాంపల్లిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. భారీగా నగదు సహా కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మచ్చుకు కొన్ని అక్రమాలు

● జనరల్‌ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పహాడీషరీఫ్‌ సబ్‌సెంటర్‌లో పని చేస్తున్న ఓ ఏఎన్‌ఎం ఇటీవల మొయినాబాద్‌ బదిలీ అయ్యింది. ఆమె వారం తిరగక ముందే మళ్లీ అదే సెంటర్‌కు డిప్యూటేషన్‌పై వచ్చింది. ఇందుకు సదరు ఏఎన్‌ఎం డీఎంహెచ్‌ఓకు భారీగా సమర్పించినట్లు తెలిసింది. సరూర్‌నగర్‌లోని మరో ఉ ద్యోగిని వద్ద ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.

● ఎన్‌హెచ్‌ఎంలో పలు పోస్టుల భర్తీకి రెండేళ్ల క్రితం నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌, మెరిట్‌లిస్ట్‌, రిజర్వేషన్‌, రోస్టర్‌ పాయింట్స్‌ విధానానికి భిన్నంగా ఏఎన్‌ఎంల నియామకాలు చేపట్టినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల 12 మంది ఏఎన్‌ ఎంలకు నియామకపత్రాలు అందించారు. ఒక్కో ఏఎన్‌ఎం నుంచి రూ.2 లక్షల చొప్పున ముడుపులు ముట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

● కందుకూరు డివిజన్‌లో పని చేస్తున్న ఇద్దరు ఏఎన్‌ఎంలు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విధి నిర్వహణలో దూరభారంతో బాధపడుతున్నారు. అనారోగ్య కారణాలతో వీరిద్దరూ కలెక్టర్‌ అనుమతితో పరస్పర బదిలీకి విజ్ఞప్తి చేసుకున్నారు. డీఎంహెచ్‌ఓ చివరకు వారినీ వదల్లేదు. వారి నుంచి రూ.50 వేలు తీసుకున్నట్లు తెలిసింది.

● మియాపూర్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఇటీవల మరో కార్పొరేటర్‌ ఆస్పత్రి టేకోవర్‌ చేసింది. ఆస్పత్రిని అమ్మకానికి పెట్టిన పాత యాజమాన్యం తమ పేరున ఉన్న అనుమతులు రద్దు చేయాలని కోరింది. అలా చేయకుండా టేకోవర్‌ చేసిన కొత్త కార్పొరేట్‌ ఆస్పత్రికి అనుకూలంగా పని చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు లేకపోలేదు.

● నర్సింగ్‌ స్కూల్స్‌, పారమెడికల్‌ కాలేజీలు అడ్మిష న్ల ప్రక్రియను పూర్తి చేసి, వెరిఫికేషన్‌ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపగా ఆయా కాలేజీ ఫైళ్లను 15 రోజుల పాటు తొక్కిపెట్టి, వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఫిర్యాదులు లేకపోలేదు.

పైరవీతో వచ్చి.. పట్టుబడి

డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి తర్వాత సుదీర్ఘకాలం పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా పని చేసిన డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు ఏడాది క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా డాక్టర్‌ లలితాదేవిని నియమించారు. ఆమె బాధ్యతలు స్వీకరించి ఆరు మాసాలు కూడా పూర్తికాకుండానే ఆ స్థానంలోకి అప్పటి వరకు వికారాబాద్‌జిల్లా డీఎంహెచ్‌ఓగా పని చేసిన ప్రస్తుత డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి వచ్చి కూర్చొంది. ఏకంగా అధినేత సిఫార్సుతో ఇక్కడికి వచ్చింది. వచ్చి నాలుగు నెలలు కూడా దాటలేదు. అప్పుడే ఏసీబీకి చిక్కింది. నిజానికి వచ్చిన కొద్ది రోజులకే ఆఫీసులోని సహోద్యోగులకు ఆమెకు మధ్య వివాదం తలెత్తింది. ఇకపై డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారితో కలిసి తాము పని చేయలేమని ఏకంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల పాటు సహాయ నిరాకరణ కూడా నడిపారు. చివరకు ప్రభుత్వ పెద్దల జోక్యంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది. వచ్చిన కొద్ది రోజులకే ఆమె అక్రమ వసూళ్లకు తెరలేపడం, అనేక ఫిర్యాదులు వెల్లువెత్తడం, తనిఖీల పేరుతో ప్రైవేటు వైద్యులను ఇబ్బందులకు గురి చేయడం వంటి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇదే సమయంలో ఓ ఫిజియో సెంటర్‌ నిర్వాహకులు ఏసీబీని ఆశ్రయించడం, ప్రైవేటు డ్రైవర్‌ పట్టుబడటం, డీఎంహెచ్‌ఓ, హెల్త్‌ సూపర్‌ వైజర్‌ల సూచనల మేరకు తాను ఆ డబ్బును తీసుకున్నట్లు ఏసీబీ ముందు అంగీకరించడం, వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

లైసెన్సుల రెన్యూవల్స్‌, ఉద్యోగుల డిప్యూటేషన్లు..

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల్లో భారీ అక్రమాలు

తాజాగా ఓ ఫిజియోథెరపీ సెంటర్‌ నుంచి రూ.లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ స్వర్ణకుమారి, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, ప్రైవేటు డ్రైవర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement