‘మంచి జీవితం కోసం.. మత్తుకు దూరంగా..’ | - | Sakshi
Sakshi News home page

‘మంచి జీవితం కోసం.. మత్తుకు దూరంగా..’

Oct 6 2026 8:37 AM | Updated on Oct 6 2026 8:37 AM

‘మంచి జీవితం కోసం.. మత్తుకు దూరంగా..’ విద్యతోనే జీవితంలో వెలుగులు నేషనల్‌ అవార్డుకు మన్‌మర్రి సర్పంచ్‌ 68 మంది టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

షాద్‌నగర్‌: మాదకద్రవ్యాల దుర్వినియోగం, దాంతో కలిగే అనర్థాలు, మత్తు పదార్థాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సామ రవీందర్‌రెడ్డి రచించిన మంచి జీవితం కోసం మత్తుకు దూరంగా.. పుస్తకాన్ని సోమవారం డీజీపీ సీవీ ఆనంద్‌ ఆవిష్కరించారు. విద్యా సంస్థల్లో మాదకద్రవ్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పుస్తకంలో రాసినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు.

షాద్‌నగర్‌: విద్యతోనే జీవితంలో వెలుగులు నిండుతాయని అడల్డ్‌ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అనిత అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం హాజిపల్లిలో ఆర్‌సీటీ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు జ్యూట్‌ బ్యాగుల తయారీలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనిత మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఉపాధి పొందడంతో పాటు విద్యను నేర్చుకోవాలని సూచించారు. తద్వార సమాజాభివృద్ధి, కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని, అక్షరాస్యత ద్వారా జీవితాల్లో అనేక మార్పులు తీసుకురావచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుమార్‌, ఫెమినా మహిళా మండలి అద్యక్షురాలు అలియా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

షాబాద్‌: మండలంలోని మన్‌మర్రి గ్రామ సర్పంచ్‌ లాలపేట్‌ బందయ్య ఉత్తమ సర్పంచ్‌గా నేషన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం నగరంలోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అధ్యక్షుడునల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. నవంబర్‌ 15న న్యూ ఢిల్లీలో నిర్వహించే బహుజన సాహిత్య అకాడమీ 20వ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా అవార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని మన్‌మర్రి సర్పంచ్‌ లాలపేట్‌ బందయ్య తెలిపారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయుల హాజరు నమోదును పర్యవేక్షిస్తున్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానంలో నెల రోజులుగా హాజరు నమోదు చేయని 68 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.వెంకటేశ్వర్లు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నెల రోజుల హాజ రును ఎందుకు నమోదు చేయలేక పోయారో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిం చారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదు ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల వేతనాలను విడుదల చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి జిల్లా ట్రెజరీ అధికారిని ఆదేశించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలన, హాజరు నమోదు, బోధన ప్రక్రియ, విద్యార్థుల అభ్యసనస్థాయిపై నిరంతర పర్యవేక్షణ, వంటి వాటిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పాఠశాలల్లో క్రమశిక్షణ, సమయపాలన, బోధనా నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement