సాయుధ పోరాటంతో విముక్తి | - | Sakshi
Sakshi News home page

సాయుధ పోరాటంతో విముక్తి

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

షాద్‌నగర్‌రూరల్‌: నిజాం నవాబుల పాలనలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేపట్టిన కమ్యూనిస్టులు పదివేల గ్రామాలకు విముక్తి కల్పించారని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ సాయుధ పోరాటం 78వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకారుల దుర్మార్గాలను, జాగీర్దారుల ఆగడాలను ఎదిరించి ప్రజలకోసం నిలబడిన నాలుగువేల మంది కమ్యూనిస్టులు నిజాం చేతుల్లో అశువులు బాసారని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపి నిజాంను తరిమికొట్టారని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టులు ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈనెల 17న హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సమితి సభ్యుడు పర్వతాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బుద్దుల జంగయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనునాయక్‌, నాయకులు టంగుటూరి నర్సింహారెడ్డి, షకీల్‌, గోవింద్‌నాయక్‌, పవన్‌చౌహాన్‌, ఆకాష్‌, మహ్మద్‌హుస్సేన్‌, ప్రసాద్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement