ఇబ్రహీంపట్నం: శేరిగూడలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, గర్భిణులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఎన్‌సీడీ రిజిస్టర్లు, మందుల నిల్వ, పరిశుభ్రత, బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వంద శాతం టీకాలు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యరత్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


