చేవెళ్ల: నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజుగా తెలంగాణ ప్రజలు విమోచన దినోత్సవాన్ని జరుపుకొంటారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణకేంద్రంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మంగళవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ శ్రేణులతో కలిసి బైక్ నడిపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17న అని అందుకే ఈరోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. దీనికోసం సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదన్నారు. అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, కంజర్ల ప్రకాశ్, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


