ఇబ్రహీంపట్నం రూరల్: నిలిచి ఉన్న బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కథనం ప్రకారం.. ఆదిభట్ల టీసీఎస్‌కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను రవాణా చేసే శ్రీనివాస ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంగళవారం సమస్య వచ్చిందని డ్రైవర్ గమనించాడు. ఉదయం ఉద్యోగులను తీసుకొచ్చి వదిలేసి గ్యారేజ్ సమీపంలో పార్కు చేశాడు. చెక్ చేయడానికి చూడగా షార్క్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారువచ్చి మంటలు ఆర్పే లోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


