పఠనాసక్తి పెంపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పఠనాసక్తి పెంపే లక్ష్యం

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

అభ్యసన శక్తిసామర్థ్యాల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ˘"{糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌSÌZÏ ^èl§ýl$Ð]l#-™èl$¯]l² õ³§ýl, Ð]l$«§ýlÅ ™èlÆý‡VýS† ѧéÅ-Æý‡$¦ÌZÏ ç³uý‡¯é-çÜMìS¢ ò³…õ³ ÌS„ýSÅ…V> Ð]l¬…§ýl$MýS$ ÝëVýS$-™èl$-¯é²…. ´ëu>Å…-Ô>-ÌSOò³ ÐéÆý‡$ Ý뫨…-_¯]l ç³r$t, AÐ]lV>-çßæ¯]l ÝëÐ]l$-Æ>¦Å°² VýS$Ç¢…^ól…§ýl$MýS$ 12 {ç³™ólÅMýS º–…§é-ÌS¯]l$ HÆ>µr$ ^ólÔ>…. E´ë-«§éÅ-Ķæ¬ÌS ç³°¡Æý‡$, ´ëu>Å…-Ô>ÌS »Z«§ýl¯]l, ѧéÅ-Æý‡$¦Ë$ {ç³§ýl-ÇØ…^ól O¯ðlç³#×êŰ² ™ðlÌS…-V>׿ çÜ*PÌŒæ Gyýl$ÅMóS-çÙ¯ŒS Ķæ*‹³ÌZ ¯]lÐðl*§ýl$ ^ólçÜ$¢-¯é²…. Ð]l$Ç…™èl Ððl$Æý‡$-OVðS¯]l çœÍ™éË$ Ý뫨…-^ól…-§ýl$MýS$ ÔèæMìS¢-Ð]l…-^èl¯]l ÌôæMýS$…yé MýS–íÙ ^ólçÜ$¢-¯é²…' A° hÌêÏ Ñ§éÅ-«¨M>Ç Ððl…MýS-sôæ-ÔèæÓÆý‡$Ï çܵçÙt… ^ólÔ>Æý‡$. D Ðól$Æý‡MýS$ "Ýë„ìS'™ø Ð]l*sêÏyéÆý‡$. {Oò³Ðólr$MýS$ HÐ]l*{™èl… ¡íÜ´ù° Ñ«§ýl…V> {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>ÌSÌZÏ ^èl§ýl$Ð]l#-™èl$¯]l² ѧéÅ-Æý‡$¦-ÌS¯]l$ ¡Ça-¨-§ýl$ª-™èl$¯]l²r$Ï {ç³MýSsìæ…-^éÆý‡$.

అందరికీ అల్పాహారం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఇప్పటికే ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అందజేశాం. ఇటీవలే షూ, టైలను సరఫరా చేశాం. రెండు జతల బట్టలు రెడీ అవుతున్నాయి. త్వరలో అందజేస్తాం. మిడ్డేమీల్‌ పథకంలో భాగంగా ఇప్పటికే ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యహ్న భోజనం అందిస్తున్నాం. గండిపేట, సరూర్‌నగర్‌, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, మొయినాబాద్‌ మండలాల్లోని 246 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం అల్పాహార పథకం అమల్లో ఉంది. దీనిలో భాగంగా 37,078 మంది చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. వీరికి రోజుకో వైరెటీ చొప్పున ఇడ్లీ, పూరి, ఊతప్పం, బొండా సహా వారానికి మూడు రోజులు రాగిజావ, మరో మూడు రోజులు పాలు అందిస్తున్నాం. ప్రస్తుతం షాద్‌నగర్‌లో అతిపెద్ద కిచెన్‌షెడ్డు సిద్ధం అవుతోంది. త్వరలో ఆ డివిజన్‌ పరిధిలోని విద్యార్థులందరికీ అల్పాహారం అందించబోతున్నాం. దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నాం.

75 మంది డిప్యూటేషన్లు రద్దు చేశాం

జిల్లాలో ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 1,342 ఉండగా, వీటిలో 1,45,097 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇప్పటికే 1,42,722 మంది పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయించాం. ప్రాథమిక, ఉన్నత పాఠశాల్లో సుమారు ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు అంచనా. ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మార్గంలో డిప్యూటేషన్‌పై వచ్చిన 75 మంది డిప్యూటేషన్లు రద్దు చేశాం. విద్యార్థుల నిష్పత్తి మేరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో 250 మందిని సర్దుబాటు చేశాం. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా చూస్తున్నాం. ఉపాధ్యాయుల హాజరు, పని తీరుపై ప్రత్యేక నిఘా పెట్టాం.

కొత్తగా మరో మూడు స్కూల్స్‌ అప్‌గ్రేడ్‌

జిల్లాలో 45 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ ఇస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి నిధులు విడుదలయ్యాయి. శానిటరీ కిట్స్‌ సహా సెల్ఫ్‌ డిఫెన్స్‌, ఇన్నోవేషన్‌ పోగ్రామ్స్‌, ఎగ్జిబిషన్స్‌, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ కొనుగోలు, పాఠశాల సుందరీకరణ పనులు, క్రీడా సామగ్రి వంటి వాటి కోసం ఈ బడ్జెట్‌ను ఉపయోగిస్తాం. పలు పాఠశాలల్లో ఏఐ పాఠాలను పరిచయం చేయబోతున్నాం. ఇప్పటికే అవసరమైన కంప్యూటర్లను ప్రభుత్వం సరఫరా చేసింది. అంతేకాదు మంచాలలోని ఆరుట్ల పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేసింది. కార్పొరేట్‌కు తీసిపోని విధంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దడం జరిగింది. అంచనాలకు మించి అడ్మిషన్లు వచ్చాయి. కొత్తగా మంచాల, నేదునూరు, పాలమాకుల పాఠశాలలను టీఎస్‌ మోడల్‌ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేయడం జరుగుతోంది.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపైనే కాదు విద్యార్థుల అభ్యసన శక్తి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. 12 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కో బృందంలో నలుగురు అధ్యాపకులు ఉండేలా చూశాం. ఈ బృందాలు పాఠశాలల్లో పర్యటించి బోధన, విద్యార్థుల అభ్యసన శక్తి సామర్థ్యాలను పరిశీలిస్తాయి. విద్యార్థులతో స్వయంగా ఇంటరాక్ట్‌ అవుతాయి. ఇప్పటి వరకు వారు నేర్చుకున్న పాఠ్యాంశాలను పరీక్షిస్తాయి. వారికి ఉన్న అవగాహన శక్తిని అంచనా వేస్తాయి. ఆయా వివరాలను ఎప్పటికప్పుడు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో నమోదు చేస్తాయి. బోధన, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పాఠశాల నిర్వహణ పనితీరుపై నిరంతర పర్యవేక్షణ చేస్తాయి. ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే కాదు ప్రైవేటు స్కూళ్లను సైతం తనిఖీ చేస్తున్నాం. డీఈఓ నెలకు 15, ఒక్కో ఎంఈఓ నెలకు 24 స్కూల్స్‌ చొప్పున విజిట్‌ చేస్తున్నారు.

విద్యార్థుల అభ్యసన శక్తి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు

ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు

మెరుగైన ఫలితాల సాధనకు కృషి

దశలవారీగా అన్ని పాఠశాలల్లో అల్పాహారం

ఉపాధ్యాయుల పని తీరుపై

నిరంతర నిఘా

‘సాక్షి’తో డీఈఓ వెంకటేశ్వర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement