ప్రతిష్ఠించకుండానే నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

ప్రతిష్ఠించకుండానే నిమజ్జనం

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

ï³Æ>j-ç³N-ÆŠ‡ÌZ ™öÍ ç³Nf ˘

అందుకోని గణేశుడు

గ్రామస్తుల మధ్య భేదాభిప్రాయాలే కారణం

కొందుర్గు: సాధారణంగా వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చవితి రోజున మండపాల్లో స్వామివారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించి, నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కానీ జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పీర్జాపూర్‌లో ఇరువర్గాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగా సోమవారం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండానే, నేరుగా చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి ఆలయంలో వినాయక ప్రతిష్ఠ చేయకూడదని పలువురు గ్రామస్తులు సూచించడంతో తమను ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేకిస్తున్నారని భావించిన నిర్వాహకులు గణేశుడి విగ్రహాన్ని నేరుగా గ్రామ చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement