పహాడీషరీఫ్: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన శ్రీభక్త మార్కండేయ పద్మశాలి పొదుపు సంఘం ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడికి 51 ఫీట్ల కండువా, 51 ఫీట్ల గాయత్రీ పంచెను బహూకరించారు. ఏటా ఆనవాయితీగా ప్రత్యేక పూజల అనంతరం వీటిని అందజేస్తున్నట్టు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మస్న రవికుమార్, మాజీ కౌన్సిలర్ కెంచె లక్ష్మీనారాయణ, నవపేట ఆంజనేయులు, కర్నాటి శ్రీహరి, వెంకటేశ్, శ్రీకాంత్, భిక్షపతి, శ్రీనివాస్, మహేశ్, కిట్టు, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.


