అసెంబ్లీలో ఎలికట్ట భూములపై ప్రస్తావన | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ఎలికట్ట భూములపై ప్రస్తావన

Sep 16 2026 8:58 AM | Updated on Sep 16 2026 8:58 AM

షాద్‌నగర్‌: మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ శివారులోని భూములపై మంగళవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. 191, 193 సర్వే నంబర్లలో ఉన్న 25 ఎకరాల భూమి 1993 నుంచి నిషేధిత జాబితాలో ఉందని, ఈ భూమిలో గత ప్రభుత్వ హయాంలో 2022లో జీహెచ్‌ఎంసీ లేఅవుట్‌ అనుమతులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉండగా గత ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా లేఅవుట్‌ను మంజూరు చేసిందని అన్నారు. నిషేధిత భూములు క్లియర్‌ చేసి అనుమతులు ఇవ్వకుండా లంచాలు తీసుకొని అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ప్రతిపక్షాలు అనడం సరికాదని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement