కేశంపేట: అందరు చిన్నారుల్లా కేక్ కటింగ్‌లు, పార్టీలు కాకుండా తన పుట్టిన రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించాడు ఎనిమిదేళ్ల బాలుడు. తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన మౌనిక, సంగీత్‌రెడ్డిల కుమారుడు తాక్షిత్‌రెడ్డి తన ఎనిమిదో బర్త్ డే సందర్భంగా ఎనిమిది మొక్కలు నాటి వినూత్నంగా వేడుకలు జరుపుకొన్నాడు. చిన్న వయస్సులోనే పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆలోచించిన బాలుడిని పలువురు అభినందించారు.
షాద్‌నగర్: పీసీసీ అధ్యక్షుడుగా మహేశ్‌కుమార్‌గౌడ్ ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆయనను ఘనంగా సత్కరించారు. పీసీసీ కార్యాలయానికి వెళ్లి మహేశ్‌కుమార్ గౌడ్‌కు పూలమాలలు వేసి, శాలువా కప్పి సత్కరించి మిఠాయి తినిపించారు.


