కడ్తాల్: పేదలకు సేవలందించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్‌లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరం మంగళవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడి వైద్య సేవలపై ఆరాతీశారు. శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఐదు రోజులుగా 4,240 మంది శిబిరాన్ని సందర్శించగా 2,762 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు 1,670 మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేసినట్లు, 142మంది కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమని గుర్తించామన్నారు. బుధవారం నుంచి కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మహేందర్‌గౌడ్, కరుణాకర్‌గౌడ్, రవికుమార్, సంధ్యా, వెంకటేశ్, రాంచందర్‌నాయక్, సభ్యులు, రఘు, లింగం, శ్రీరాములు, నరేందర్‌గౌడ్, కొండల్‌యాదవ్, శేఖర్, శ్రీను, మల్లేశ్, శ్రీను, మహేశ్ ఉన్నారు.
ఫౌండేషన్ చైర్మన్,
టాస్క్ సీఈఓ రాఘవేందర్‌రెడ్డి


