అబ్దుల్లాపూర్‌మెట్: తమ కులానికి చెందిన గుండోజి రంగదాసు పంతులు విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టిస్తూ, అడ్డుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమళ్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన కొంతమంది తమ కులాన్ని కించపరిచేలా వ్యవహరిస్తూ, విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ సీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆర్.జయసింహ, సహాయ కార్యదర్శులు మెగిలి రఘు, కంది సత్యం, ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్, రాష్ట్ర వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు చెన్నారం మల్లేశం, అబ్దుల్లాపూర్‌మెట్ నాయి బ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు రంగయ్య, సభ్యులు దాసారం రవి, లంగారి శ్రీను, మల్లేశ్, అనిల్, గుండాల రాజారాం తదితరులు పాల్గొన్నారు.
నాయీబ్రాహ్మణ సంఘం నేతల ఫిర్యాదు


