ఇబ్రహీంపట్నం: కామ్రెడ్ సీతారాం ఏచూరి ఆశయాల సాధన కోసం పోరాటం చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.సామేల్ పిలుపునిచ్చారు. సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా శనివారం ఇబ్రహీంపట్నం పాషనరహరి స్మారక కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సామేల్ మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమం నుంచి సీపీఎం జాతీయ కార్యదర్శిగా ఏచూరి ఎదిగారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఎండగట్టారని, వామపక్షాల ఐక్యతకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బుగ్గరాములు, జంగయ్య, జగన్, శారద, గణేశ్, ముసలయ్య, ప్రభుదాసు, నర్సింహ, విజయ్, యాదగిరి పాల్గొన్నారు.


