ఆమనగల్లు: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హాలులో శనివారం మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అధికారులు అలసత్వం వీడాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకుసాగాలని అన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రెండు నెలల్లో విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని విద్యుత్ ఏడీఈ బాలకృష్ణకు సూచించారు. సమావేశంలో మార్కెట్‌చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్యానాయక్, ఎంపీడీఓ జయరాంవిజయ్, ప్రత్యేకాధికారి శోభారాణి, డీటీ వినోద్‌కుమార్, ఎంఈఓ పాండు, సీఐ వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్‌చౌహాన్, వ్యవసాయాధికారి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి


