న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026
తొలిరోజు సగం కూడా రాని విద్యార్థులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నెలన్నర రోజుల తర్వాత పాఠశాలల గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. సోమవారం సరిగ్గా ఉదయం తొమ్మిది కాగానే బడిగంటలు మోగాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టారు. తొలి రోజు హాజరు పది శాతంలోపే నమోదైంది. పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా పాఠశాలల ఆవరణలను అందంగా తీర్చిదిద్దారు. స్కూలుకు చేరుకున్న వారికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ ఉచితంగా పంపిణీ చేశారు. సరూర్‌నగర్, గండిపేట మండలాల్లోని పలు పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందజేశారు. మధ్యాహ్నం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం సరఫరా చేశారు.
అమావాస్య సెంటిమెంట్‌తో..
అమావాస్య సెంటిమెంట్ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు నిరాకరించారు. కడ్తాల్ మండల పరిధి లోని వివిధ పాఠశాలల్లో 1,226 మంది చదువుతుండగా 142 మంది మాత్రమే హాజరయ్యారు. మండల కేంద్రంలోని బాలుర పాఠశాలలో 175 మందికి ఇద్దరే హాజరయ్యారు. బాలికల పాఠశాలలో 110 మందికి 15 మంది మాత్రమే వచ్చారు. యాచారం మండ లంలో 3,500 మంది విద్యార్థులకు కేవలం 150 మంది హాజరయ్యారు. రెండో రోజైన మంగళవారం కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. బుధవారం నుంచి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
గుర్రంగూడ పాఠశాలకు హుషారుగా వస్తున్న విద్యార్థులు
తెరుచుకున్న పాఠశాలలు
విద్యార్థులకు ఘన స్వాగతం
అమావాస్య ఎఫెక్ట్‌తో తగ్గిన హాజరు
పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ షురూ


