మా భూముల్లోకి మమ్మల్ని వెళ్లనివ్వండి | - | Sakshi
Sakshi News home page

మా భూముల్లోకి మమ్మల్ని వెళ్లనివ్వండి

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: మా భూముల్లోకి మమ్మల్ని వెళ్లనివ్వండి .. వ్యవసాయం చేసుకొని బతుకుతాం అని అధికారులను కాస్‌బాగ్‌ రైతులు వేడుకున్నారు. సోమవారం నాదర్‌గుల్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ గేటు ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాదర్‌గుల్‌ సర్వే నంబర్‌ 613లో తమ భూములు ఉన్నాయని, అక్కడ అడ్డుగా ఉన్న బ్లూషీట్స్‌ తొలగించి రోడ్డు మార్గం చూపించాలని కోరారు. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

నాదర్‌గుల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు రైతుల పాదయాత్ర

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement