రేపు ఆరుట్ల పబ్లిక్‌ స్కూలు ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

రేపు ఆరుట్ల పబ్లిక్‌ స్కూలు ప్రారంభోత్సవం

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

మంచాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంచాల మండలం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇదే వేదికగా అల్పాహారం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేయనున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల సందర్శన, కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయం, నూతనంగా ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు, క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించనున్నారు. పాఠశాలకు సమీపంలోని అమ్మోరుతల్లి దేవాలయం సమీపంలో హెలీప్యాడ్‌ పనులు చేపట్టారు. అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 20 వేల మందిని తరలించాలని భావిస్తున్నారు. ఆరుట్లకు సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సోమవారం విద్యాశాఖ కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌, డీఈఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ ఎంవీ ప్రసాద్‌, ఎంపీడీఓ వసంతలక్ష్మి, ఏసీపీ రాజు, సర్పంచ్‌ శోభ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హాజరు కానున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement