ఆమనగల్లు: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలలు వేసి, గ్రామంలో బడిబాట ర్యాలీ నిర్వహించారు. అనంతం ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఎస్‌సీ లో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు, ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా చారకొండ వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యాకమిషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రూపొందించి అ మలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మారుస్తూ అత్యాధునిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇంటర్ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములమ్మ, ఉపసర్పంచ్ విజయలక్ష్మి, ఎంఈఓ చాంప్లానాయక్, మార్కెట్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకురు ప్రభాకర్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ అంజయ్యగౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.
విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేశ్


