ఎరువుల బుకింగ్‌ యాప్‌ రద్దు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎరువుల బుకింగ్‌ యాప్‌ రద్దు చేయండి

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

షాబాద్‌: ఎరువుల బుకింగ్‌ యాప్‌ రద్దు చేయాలంటూ సోమవారం షాబాద్‌ రైతు వేదిక కార్యాలయం వద్ద ఽరైతులు ఆందోళన చేపట్టారు. రైతు వేదికకు తాళం వేసి అధికారులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యాప్‌లో సాంకేతిక లోపాలు, ఓటీపీ సమస్యలు, ఎరువుల బుకింగ్‌లో జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వెంటనే బుకింగ్‌ యాప్‌ను రద్దు చేసి, గతంలో మాదిరిగా నేరుగా ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సహకార సంఘంలో ఎరువుల స్టాకు ఉంచాలన్నారు. వెంటనే అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

రైతు వేదిక కార్యాలయానికి తాళం వేసి ఆందోళన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement