అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలి

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

అర్హులైన ఓట్లు తొలగించకుండా చూడాలి

తుక్కుగూడ: ఓటర్ల జాబితా సవరణ విషయంలో కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి సూచించారు. మంఖాల్‌ డివిజన్‌ ఇమామ్‌గూడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం కాంగ్రెస్‌ పార్టీ బీఎల్‌ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించినట్టు తెలిపారు. క్షేత్రస్థాయిలో మనం నిర్లక్ష్యం వహిస్తే పార్టీకి, ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందన్నారు. అర్హులైన ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్లార్‌, విజయ డెయిరీ చైర్మన్‌ గుత్తా అమిత్‌రెడ్డి, నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, చిగిరింత పారిజాతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement