తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ సూపర్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ సూపర్‌

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ సూపర్‌

మంచాల: ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ చాలా బాగుందని ఆర్‌టీఐ కమిషనర్‌ అయోధ్య రెడ్డి అన్నారు. ఆదివారం స్కూల్‌ను సందర్శించిన ఆయన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు, ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు.. విద్యా బోధన అమలు తీరు.. సదుపాయాలపై ఆరా తీశారు. కార్పొరేట్‌ కంటే చాలా బాగుందని కితాబిచ్చారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి, సభ్యులు శివారెడ్డి, చారకొండ వెంకటేశ్‌, పద్మజాష, డీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎంవీ ప్రసాద్‌, ఎంఈఓ రాందాస్‌, హెడ్‌ ఆఫ్‌ ది స్కూల్‌ గిరిధర్‌గౌడ్‌, ఆరుట్ల మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాములు, నోడల్‌ ఆపీసర్‌ కిషన్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

17న సీఎం రేవంత్‌ రెడ్డి రాక!

ఈ నెల 17న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించినట్టు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement