డంపింగ్‌ యార్డ్‌ వద్దేవద్దు | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డ్‌ వద్దేవద్దు

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

వ్యతిరేకంగా 14 గ్రామాల ప్రజల ఆందోళన

అబ్దుల్లాపూర్‌మెట్‌: మండల పరిధిలోని బండరావిరాల సర్వే నంబర్‌ 268లో ప్రభుత్వం ఎకోటౌన్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న డంపింగ్‌ యార్డును వ్యతిరేకిస్తూ సుమారు 14 గ్రామాల ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆదివారం ఆందోళన బాటపట్టారు. చిన్నరావిరాలలోని గువ్వలేటి కూడలి నుంచి సద్దుపల్లి కూడలి వరకు వందలాది మంది సుమారు 5 కిలోమీటర్ల మేరకు నిరసన ర్యాలీ చేపట్టారు. డంపింగ్‌ యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిన్నరావిరాల సర్పంచ్‌ పబ్బతి బాలకిషన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేస్తే గ్రామాలన్నీ కాలుష్యకోరల్లో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం తెచ్చిన జీఓ నెం. 20ని వెంటనే రద్దు చేసి ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 14 గ్రామాల ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయాలని చూస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచులు కందికంటి విజయ్‌కుమార్‌, కొలన్‌ ప్రసన్నరవీందర్‌రెడ్డి, జంగయ్యయాదవ్‌, పెరుమాళ్ల మహాలక్ష్మీ దానయ్య, మహేశ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement