నగరంలో ‘మత్తు’ కలకలం | - | Sakshi
Sakshi News home page

నగరంలో ‘మత్తు’ కలకలం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

నగరంలో ‘మత్తు’ కలకలం

గచ్చిబౌలి: అపార్ట్‌మెంట్‌పై మెరుపు దాడి చేసిన పోలీసులు ఎండీఎంఏ, ఓజీకుష్‌ గంజాయిని స్వాధీనం చేసుకుని విక్రేతతోపాటు 8 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు.మాదాపూర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. మాదాపూర్‌లోని చందానాయక్‌ తండాలో డ్రగ్స్‌ విక్రయంతోపాటు వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందంది. దీంతో మాదాపూర్‌, కూకట్‌పల్లి ఎస్‌ఓటీ పోలీసులు శనివారం అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. విజయవాడకు చెందిన దనేకుల తరుణ్‌ తేజ్‌(22) వద్ద 15 గ్రాముల ఎండీఎంఏ, 382 గ్రాములు ఓజీ కుష్‌ గాంజా, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే డ్రగ్స్‌ వినియోగిస్తున్న 8 మంది నిరుద్యోగులను అదుపులోకి ఎండీఎంఏ, ఓజీకుష్‌ గంజాయి సరఫరా చేసిన విజయవాడకు చెందిన కార్తీక్‌, పృథ్వీ పరారీలో ఉన్నారు.

26 కిలోల గంజాయి స్వాధీనం

గచ్చిబౌలి: విక్రయించేందుకు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఓ పెడ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినమేరకు.. గచ్చిబౌలి పోలీసులు, ఎస్‌ఓటీ పోలీసులు కలిసి శనివారం సాయంత్రం నానక్‌రాంగూడలోని సుమధుర అక్రోపోలిస్‌ అపార్ట్‌మెంట్‌ ఎదురుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మంగళ్‌హట్‌కు చెందిన మహ్మద్‌ నయీమ్‌ (26) ఆటోలో గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ప్యాక్‌ చేసి ఉన్న 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ గంజాయిని సరఫరా చేసిన ఒడిశాకు చెందిన గౌతమ్‌ నాయక్‌, స్థానిక విక్రేతలు నీతూబాయ్‌, గౌతమ్‌ సింగ్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

గంజాయి విక్రేత అరెస్ట్‌

జవహర్‌నగర్‌: రోడ్డు పక్కన గంజాయి విక్రయిస్తున్న స్థావరాలపై మల్కాజిగిరి ఎకై ్సజ్‌ పోలీసుల దాడి మెరుపు దాడులు నిర్వహించి 2.1 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటన అంబేద్కర్‌నగర్‌తో పాటు కాప్రా మండలంలోని అనీష్‌కళాశాల ఆవరణలో ఆదివారం చోటుచేసుకుంది. ఎకై ్సజ్‌ సీఐ రవి తెలిపిన మేరకు.. జవహర్‌గనగర్‌ పరిధిలోని అంబేడ్కర్‌నగర్‌లో గంజాయిని అమ్ముతుండగా విశ్వనియసమాచారం మేరకు ఆర్టీసీ డిపో ఎదురుగా ఎకై ్సజ్‌ పోలీసులు తనిఖీలు చేస్తూ ఓ ద్విచక్రవాహనాన్ని పట్టుకున్నారు. పరిశీలించగా 1.365 కేజీల గంజాయి బయటపడింది. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని షేక్‌ సల్మాన్‌ అలియాస్‌ సలీమ్‌(25), సెమంగుల రఘు(24), మారిపల్లి మహేష్‌(23)లను అరెస్ట్‌ చేశారు.

కిరాణా షాపుల్లో నిషేధిత మత్తు పదార్థాలు

శంషాబాద్‌ రూరల్‌: కిరాణాషాపుల్లో నిషేధిత మత్తు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పాల్మాకుల, పెద్దషాపూర్‌, ముచ్చింతల్‌లో ఆదివారం రాత్రి శంషాబాద్‌ పోలీసులు, ఈగల్‌, నార్కోటిక్‌ డ్రగ్‌ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో కిరాణాదుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. పాల్మాకులలో ప్రవీణ్‌కుమార్‌, రోహిత్‌కుమార్‌ నిర్వహిస్తున్న కిరాణా దుకాణాల్లో నిషేధిత తంబాకు, గుట్కా ప్కాకెట్లు లభించాయి. వీటిని సీజ్‌ చేసిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement