1,321 | - | Sakshi
Sakshi News home page

1,321

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

ఫిట్‌లెస్‌ బడి బస్సులు

సాక్షి, సిటీబ్యూరో: బడి గడువు ముంచుకొచ్చింది. సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోను న్నాయి. సాధారణంగా ప్రతి ఏటా మే నెలలో అన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. కానీ.. విద్యాసంస్థల నిర్లక్ష్యం, ఆర్టీఏ అధికారుల ఉదాసీనత కారణంగా గ్రేటర్‌ పరిధిలో ఇప్పటికీ 1,321 బస్సులకు ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి కాలేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సుమారు 13,730 బడి బస్సులు ఉన్నాయి. స్కూళ్లు తెరుచుకొనే సమయానికి అన్ని బస్సులకు సామర్థ్య పరీక్షలు పూర్తి కావాల్సిఉండగా ఇంకా వందల సంఖ్యలో మిగిలిపోవడం గమనార్హం. మరోవైపు ఫిట్‌నెస్‌ లేకుండా తిరిగే బస్సులపై చర్యలు చేపట్టేందుకు ఈ నెల 15 నుంచే ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ ఫిట్‌నెస్‌ తీరు

జిల్లా మొత్తం ఫిట్‌నెస్‌ ఫిట్‌నెస్‌

బస్సులు పూర్తయినవి పూర్తి కానివి

హైదరాబాద్‌ 1,265 1,100 165

రంగారెడ్డి 6,307 5,682 625

మేడ్చల్‌ 6,158 5,627 531

విద్యా సంస్థలు, ఆర్టీఏ అధికారుల ఉదాసీనత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement