ప్రజా సంక్షేమం.. ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమం.. ప్రభుత్వ లక్ష్యం

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

ఆమనగల్లు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అర్హులందరికీ రాజకీయాలకు అతీతంగా పతకాలు అందజేస్తుందన్నారు. నగరంలోని తన నివాసంలో.. తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన వెంకటయ్యకు మంజూరైన రూ.75 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును శనివారం అందజేసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం పార్టీ నాయకులు గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడురు శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సురేందర్‌రెడ్డి, రేణురెడ్డి, అజీజ్‌, ఆరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement