నిర్మాణ రంగంలో రారాజు భారతి సిమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ రంగంలో రారాజు భారతి సిమెంట్‌

Jun 14 2026 10:25 AM | Updated on Jun 14 2026 10:25 AM

యాచారం: నిర్మాణ రంగంలో రారాజు భారతి ఆల్ట్రాఫాస్ట్‌ సిమెంట్‌ అని, నిర్మాణాలు దృఢంగా ఉంటాయని ఆ సంస్థ టెక్నికల్‌ ఇంజినీర్‌ సామ్రాట్‌ అన్నారు. మండల కేంద్రంలో శనివారం తాపీమేస్త్రీలు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగంలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ.. వినియోగదారుల విశ్వాసాన్ని పొందడమే సంస్థ లక్ష్యమన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భారతి సిమెంట్‌ను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. స్లాబ్‌ కాంక్రిట్‌ సమయంలో సంస్థ ఇంజినీర్లు సైట్‌ వద్దకు వచ్చి సాయపడతారని చెప్పారు. మార్కెట్లో లభించే ఇతర సిమెట్లతో పోల్చితే భారతి ఆల్ట్రాఫాస్ట్‌ బలం అధికంగా ఉంటుందని తెలిపారు. అనంతరం రూ.లక్ష ప్రమాద బీమా బాండ్లు, బ్యాగులు అందజేశారు. కార్యక్రమంలో డీలర్‌ తలారి మల్లేశ్‌, తాపీమేస్త్రీలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement