టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

మంచాల: ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కపల్లి పెంటయ్య అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010కి ముందు న్యాయబద్ధంగా నోటిఫికేషన్‌వచ్చి నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ అవసరం లేదని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని తెలిపారు. తరువాత డీఎస్సీ నోటిఫికేషన్‌లో టెట్‌ అర్హత ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయన్నారు. దీంతో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు ప్రస్తుతం అన్యాయం జరుగుతోందని, వారికి టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో రాష్ట్రం కేంద్రాన్ని ఒప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర బాధ్యుడు సత్తారి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాశిరావు, పూజరి రమేష్‌, ఉపాధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి, కృష్ణ, మండల అధ్యక్షుడు రావుల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement