కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరించే స్వచ్ఛ వెళ్లడం లేదు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్లలోనూ (జీవీపీ) చెత్తను సకాలంలో తరలించకపోవడం మా దృష్టికి వచ్చింది. ఐటీ ఆధారిత సేవల ద్వారా సీఅండ్‌డీ వేస్ట్ గురించి ఫిర్యాదు చేసిన వారు వాటి పరిష్కారాన్ని కూడా ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెస్తాం. ఎక్కడెక్కక లోపాలున్నాయో గుర్తించి సరిచేస్తాం.
– ఆర్‌వీ కర్ణన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్
మూడు నాలుగు నెలల్లో పరిష్కరిస్తాం
సీఎంసీలోని ఎక్కువ ప్రాంతాల్లో వీధిదీపాల సమస్య నెలరోజుల్లో పరిష్కరిస్తాం. మూడు కార్పరేషన్లకు కలిపి ఇప్పటికే టెండర్లు పిలిచారు. మిగతా వాటిల్లో దెబ్బతిన్న రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తదితరమైనవి ఉన్నాయి. పారిశుద్ధ్యం తదితర సమస్యలను మూడు నాలుగు నెలల్లోగా పరిష్కరిస్తాం
– జి. సృజన, సీఎంసీ కమిషనర్
పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాలు
ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు స్వచ్ఛ ఆటోలు వెళ్ళని ఇళ్లకు ఆ సదుపాయం కలిగేలా చేశాం. జీవీపీల వద్ద చెత్త ఎప్పటికప్పుడు తొలగించే చర్యలు తీసుకున్నాం. నిర్మాణ కూల్చివేతల వ్యర్ధాలు తరలించేందుకు ప్రజలే చార్జీలు చెల్లించేలా అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకున్నాం. కొత్తగా పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయగలిగాం.
– వినయ్ కృష్ణారెడ్డి, కమిషనర్ ఎంఎంసీ


