ప్రజలకు అందుబాటులో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు అందుబాటులో ఉండాలి

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

తుక్కుగూడ: పోలీస్‌ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, వారికి సేవలు అందించాలని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. తుక్కుగూడ పరిధిలోని ఈ–సిటీలో సోమవారం ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌ సిటీ కార్యాలయం ఇప్పటి వరకు కలెక్టర్‌ కార్యాలయంలో కొనసాగిందని తెలిపారు. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో ఈ–సిటీలో తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యాలయం ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు పక్కనే రవాణా పరంగా అందుబాటులో ఉందన్నారు. ఫ్యూచర్‌ సిటీ శాశ్వత భవనం కోసం మీర్‌ఖాన్‌పేటలో ప్రభుత్వం 24 ఎకరాల స్థలం, భవన నిర్మాణానికి ప్రాథమికంగా రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీ జి.సుధీర్‌బాబు, జాయింట్‌ సీపీ చందనా దీప్తి, డీసీపీలు కె.నారాయణరెడ్డి, శిరీష, యోగేష్‌ గౌతమ్‌, ట్రాఫిక్‌ డీసీపీ శివమ్‌ ఉపాధ్యాయ, ఏసీపీలు జానకిరెడ్డి, అరుణ్‌కుమార్‌, కిషన్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

డీజీపీ శివధర్‌రెడ్డి

ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ కార్యాలయం ప్రారంభం

Advertisement
 
Advertisement
Advertisement