టీబీ నిర్మూలనకు కృషి చేద్దాం | - | Sakshi
Sakshi News home page

టీబీ నిర్మూలనకు కృషి చేద్దాం

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

ఇబ్రహీంపట్నం రూరల్‌: టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ పాపారావు పేర్కొన్నారు. టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో కొంగరకలాన్‌లోని న్యూ గెలాక్సీ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో మెగా హెల్త్‌ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ పాపారావు మాట్లాడుతూ.. టీబీ బాధితులు సకాలంలో మందులు వాడితే తిరిగి మామూలు స్థితికి చేరుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు నిరంతరం అందుబాటులో ఉంటాయని, సరైన పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ లక్ష్మీప్రసన్న, ఎల్మినేడు వైద్యులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి, విశ్వనాథ్‌, డాక్టర్‌ జనార్దన్‌, టీబీ రెడియోగ్రాఫర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టెక్నీషియన్‌ జైహింద్‌, సూపర్‌వైజర్‌ శివ, కోఅర్డినేటర్‌ జ్యోతి, సూపర్‌వైజర్‌ అజయ్‌కుమార్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ పాపారావు

Advertisement
 
Advertisement
Advertisement