స్వీయ గణన నమోదు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

స్వీయ గణన నమోదు చేసుకోండి

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో పాల్గొని వారి వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం ప్రజావాణి అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వీయగణన ఆన్‌లైన్‌ పోర్టల్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఐడీ పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సెన్సన్‌ ఇన్‌చార్జి అధికారి శిరీష పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ప్రజావాణికి 65 దరఖాస్తులు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌ నారాయణరెడ్డి అదనపు కలెక్టర్‌ కిరణ్మయితో కలిసి అర్జీలు స్వీకరించారు. ప్రజలు అందించే వినతులను సంబంధించి అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 65 ఫిర్యాదులు అందాయని వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 21, ఇతర శాఖలకు సంబంధించి 44 అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement