ఇబ్రహీంపట్నం: వచ్చేది మళ్లీ మన ప్రభుత్వమే అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఇబ్రహీంపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఇందిర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి


