కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

ఆమనగల్లు: మున్సిపాలిటీ కోఆప్షన్‌ సభ్యులుగా బీజేపీకి చెందిన చుక్కా అల్లాజీగౌడ్‌, కండె సీతమ్మ, హలీమాబేగం, కాంగ్రెస్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ఎన్నికయ్యారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ పత్యానాయక్‌ అధ్యక్షతన కమిషనర్‌ శంకర్‌నాయక్‌ పర్యవేక్షణలో నాలుగు పదవులకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. సమావేశానికి వైస్‌ చైర్మన్‌ తల్లోజు గీత, కౌన్సిలర్‌లు దోళి, యశోదమ్మ, ఆంజనేయులు యాదవ్‌, పాపిశెట్టి రాము, నిరంజన్‌, రమేశ్‌, మహేశ్‌, అనిత, సునీత, నాగిళ్ల జగన్‌, అనూష, వెంకటయ్య, భాగ్యలక్ష్మి హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 8 మంది సభ్యులు కలిసి కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన వారికి 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికై న వారికి మున్సిపల్‌ కమిషనర్‌ ధ్రువీకరణ పత్రాలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement