మహిళ మృతిపై విచారణ | - | Sakshi
Sakshi News home page

మహిళ మృతిపై విచారణ

Apr 28 2026 8:40 AM | Updated on Apr 28 2026 8:40 AM

తుర్కయంజాల్‌: చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన మహిళ మృతిపై పూర్తి విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని డాక్టర్‌ రవినాయక్‌, డాక్టర్‌ భానుప్రకాశ్‌, డాక్టర్‌ వినయ్‌ కోట బృందం వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లికి చెందిన కె.దివ్య వైద్యం నిమిత్తం ఈనెల 24న రాగన్నగూడలోని మహోనియా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చి, మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈఅంశంపై విచారణ చేసేందుకు మహేశ్వరం మెడికల్‌ కళాశాలకు చెందిన వైద్య బృందాన్ని నియమించారు. సోమవారం ఆ స్పత్రికి వచ్చిన వైద్యులు దివ్యకు అందించిన చికి త్స వివరాలను సేకరించడంతో పాటు పలు రిపోర్ట్‌లను పరిశీలించారు. ఐసీయూలోని సీసీ పుటేజీలను సైతం తీసుకున్నట్లు సమాచారం. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ లక్ష్మీప్రసన్న, మండల వైద్యాధి కారి ప్రియాంక, డాక్టర్‌ శృతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement