బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8లోu సాక్షి, రంగారెడ్డి జిల్లా: తీపిని పంచాల్సిన పండ్లు కడుపులో విషాన్ని నింపుతున్నాయి. మామిడి ప్రియుల ఆరోగ్యంపై దాడి చేస్తున్నాయి. రైతులు తమ పంటను పక్వానికి రాకముందే తెంపి, మార్కెట్‌కు తరలిస్తున్నారు. సహజ సిద్ధంగా పండాల్సిన పండ్లను కృత్రిమ పద్ధతిలో పండిస్తున్నారు. త్వరగా పండేలా నిర్దేశిత ప్రమాణాలకు మించి క్యాల్షియం కార్బైడ్‌ వినియోగిస్తున్నారు. కంటికి అందంగా, ఆకర్షణీయంగా, తాజాగా కన్పించేందుకు పలువురు వ్యాపారులు వ్యాక్స్‌, సింథటిక్‌ కలర్లు అద్దుతున్నారు. వెరసి వీటిని కొనుగోలు చేసి, తిన్నవారు జీర్ణకోశ, శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు, చర్మంపై దద్దుర్ల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఎస్‌ఓటీ పోలీసులు నగరంలోని పలు పండ్ల గోదాములపై దాడి చేసి పరిశీలించగా విస్తు గొలిపే అంశాలు వెలుగు చూశాయి. తూనికలు కొలతలు, మార్కెటింగ్‌, ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు ఆయా మార్కెట్లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా.. కమీషన్‌ ఏజెంట్లు ఇచ్చే మాముళ్లకు కక్కుర్తిపడి అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలను ఎలాగైనా క్యాష్‌ చేసుకోవాలని భావించిన పలువురు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మోతాదుకు మించి రసాయనాలు వాడుతూ కాయలను మగ్గబెడుతూ.. ప్రజా రోగ్యంతో చెలగాటమాడుతున్నారు. విపరీతమైన మంచు కారణంగా ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పూత, కాత రాలేదు. దిగుబడి భారీగా తగ్గింది. అంతో ఇంతో వచ్చిన పంట కూడా ఇటీవల ఈదురుగాలులతో కూడిన వర్షాలకు నేలరాలింది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. వీధుల్లో తోపుడు బండ్లపై అందంగా, ఆకర్షణీయంగా సువాసన వెదజల్లుతున్న మామిడిని తినేందుకు పిల్లలు ఇష్టపడుతున్నారు. ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తీరా కొనుగోలు చేసి తిన్న తర్వాత రుచీపచీ లేక ఉసూరుమంటున్నారు. కృత్రిమ పద్ధతిలో మగ్గించిన ఈ పండ్లను తిన్న వారు గొంతులో మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలతో ఆస్పత్రుల పాలవుతుంటే.. అక్రమార్కులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఏకంగా వ్యాక్స్‌ కెమికల్‌తో పాటు చైనా సింథటిక్‌ కలర్లు, కాయ ఎదుగుదలను ప్రోత్సహించే ఇథలిన్‌ వాయువును విడుదల చేసే ఎథెపాన్‌ వాడుతున్నారు. పండ్లకు ఫంగస్‌ సోకకుండా ఉండేందుకు థియాబెండజోల్‌, కార్బైండజిమ్‌, సోడియం బైక్లోరైడ్‌ వంటి రసాయనాలు వాడుతున్నారు. మోతాదుకు మించి వాడుతుండటంతో రుచి తగ్గుతోంది.

న్యూస్‌రీల్‌

తిన్న తర్వాత రుచీపచీ లేక

పిందె దశ నుంచే రసాయనాలు

మామిడి.. ఆరోగ్యంపై దాడి

పక్వానికి రాక ముందే రసాయనాలతో మగ్గబెట్టి విక్రయాలు

తాజాధనం కోసం వ్యాక్స్‌,

సింథటిక్‌ కలర్స్‌ వినియోగం

చూస్తే నోరూరు.. తింటే బేజారు

కడుపులోకి కార్బైడ్‌ విషం

రంగు చూసి కొంటే మోసపోయినట్లే అంటున్న వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement