రాబోయేది బీసీల రాజ్యం | - | Sakshi
Sakshi News home page

రాబోయేది బీసీల రాజ్యం

Apr 8 2026 8:08 AM | Updated on Apr 8 2026 8:08 AM

షాబాద్‌: రాబోయేది బీసీల రాజ్యమేనని మన ఆలోచన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు అన్నారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ కూడలిలో మంగళవారం నిర్వహించిన బీసీ సర్పంచుల సన్మాన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలైనా బీసీలకు న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్రానికి ఒక్క ముఖ్యమంత్రి కూడా వెనుకబడిన కులాల నుంచి రాలేడు అంటే మన బతుకులు రాజకీయపరంగా ఎలా ఉన్నాయో ఆలోచించాలని తెలిపారు. వెనుకబడిన కులాల వారంతా ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఈనెల 19న నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించే బీసీ జన జాగరణ జాతరకు బహుజనులంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మన ఆలోచన సాధన సమితి ఉపాధ్యక్షులు సంఘం రామేశ్వరయ్య, పంతంగి విఠలయ్యగౌడ్‌, పవన్‌కుమార్‌, 42 శాతం బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి సభ్యులు రమేష్‌ యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రాపోల్‌ నర్సింలు, వెంకటేశ్‌గౌడ్‌, రాము, గడ్డం చంద్రయ్య, రాజయ్య, గోపాల్‌, రవీందర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, గోవర్ధన్‌, మాణిక్యం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మన ఆలోచన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement